VKB: జిల్లా వ్యాప్తంగా వికారాబాద్, తాండూరు, మోమిన్ పేట, లాంటి అనేక ప్రాంతాల్లో రేపు ఉదయం 10 వరకు చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం వాతావరణం మొత్తం మేఘావృతమై ఉందని, నేడు ఉష్ణోగ్రతల సైతం గత వారం రోజులతో పోలిస్తే తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. ఏదేమైనప్పటికీ ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.