CTR: సినిమా, సీరియల్ రంగంలో ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ పోతుల శ్రీనివాసులు (60) బుధవారం చెన్నైలో మృతి చెందారు. రొంపిచర్లలోని బెస్తపల్లికి చెందిన ఈయన 30 ఏళ్లుగా తమిళం, తెలుగు సినిమా, సీరియల్ రంగంలో ఉన్నారు. కాగా, గుండెపోటు రావడంతో చెన్నైలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.