AP: అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు చంద్రబాబుకు ఆశీర్వచనం అందించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో చేపడుతున్న ఏర్పాట్లపై బీఆర్ నాయుడుతో సీఎం మాట్లాడారు.