TG: అమరవీరులందరికీ BRS పార్టీ తరఫున శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, పార్టీ నేతలు జాతీయ జెండాను ఎగరవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు ఇది అని గుర్తుచేశారు.