TG: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ నెట్వర్క్ హాస్పిటల్స్(TANHA) ప్రకటించింది. దాదాపు 323 ప్రైవేట్ ఆస్పత్రులు అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నాయి. ఆగస్టు నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి కారణమని సంఘం అధ్యక్షుడు డా. వద్దిరాజు రాకేశ్ తెలిపారు. ఈ నిర్ణయంతో రోగులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.