ADB: బోథ్ MLA క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సమైక్యతా దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు.