E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలో ఈనెల 15న కనిపించకుండా పోయిన బాలుడు టీ.వరుణ్‌ను పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి కోసం సీఐ టీ.గణేశ్ ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా గాలించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి పోలీసు బృందాన్ని పంపి, బాలుడిని క్షేమంగా తీసుకొచ్చి మంగళవారం తల్లిదండ్రులకు అప్పగించారు.