వేములవాడలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో భగవంతు రావు నగర్లో విశ్వకర్మ జయంతి మహోత్సవం జరిగింది. ఈ వేడుకలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మంజూరైన రూ. 6 లక్షల నిధుల ప్రొసీడింగ్స్ కాపీలను సంఘ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.