SRCL: వేములవాడ ప్రాజెక్ట్ పరిధిలోని అంగనవాడి టీచర్లకు ‘పోషణ్ భీ, పఠాయి భీ’పై మూడు రోజుల శిక్షణ ఇచ్చారు. 0-6 ఏళ్ల పిల్లల అభివృద్ధి, తల్లి-శిశు సంరక్షణ, ఆరోగ్య పరీక్షలు, పోషణపై అవగాహన కల్పించారు. తక్కువ బరువున్న పిల్లల గుర్తింపు, అదనపు ఆహారం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రతి నెల నాల్గవ శనివారం నిర్వహించే E.C.C.E. ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు.