గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ను కట్టడి చేసేందుకు ఈయూ నడుం బిగించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఉత్పత్తులపై సుంకాలు పెంచాలని ఐరోపా దేశాలను ఈయూ కోరింది. అలాగే 10 మంది హమాస్ నేతలపై కూడా పలు ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. ఈ ఆంక్షలు ఇజ్రాయెల్ను శిక్షించడానికి కాదని.. దాని పద్దతులను మార్చుకోవడానికని పేర్కొంది. తద్వారా గాజా ప్రజల కష్టాలు తొలుగుతాయని అభిప్రాయపడింది.