కృష్ణా: అవనిగడ్డలో ఎంపీ వల్లభనేని బాలశౌరి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. వంతెన సెంటరులో నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమిష్టి నాయకత్వంలో అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోందని నాయకులు పేర్కొన్నారు.