ఆసియా కప్-2025 టోర్నీలో గ్రూప్- ఏ నుంచి భారత్, పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాయి. దీంతో సూపర్-4లో మరోసారి పాకిస్తాన్తో భారత్ తలపడనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత ఇరు జట్లు ఫైనల్ చేరితే మూడోసారి కూడా తలపడే ఛాన్స్ ఉంది. కానీ ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, పాక్ ఫైనల్లో తలపడలేదు.