దివంగత లెజెండరీ నటుడు ANR 101వ జయంతి సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన నటించిన సూపర్ హిట్ క్లాసికల్ సినిమాలు ‘డాక్టర్ చక్రవర్తి’, ‘ప్రేమాభిషేకం’ ఈ నెల 20న రీ-రిలీజ్ కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో వీటిని ప్రదర్శించనున్నారు. ఈ మేరకు ANR సీనియర్ అభిమానులకు ఫ్రీ టికెట్స్ అందించనున్నారు.