CTR: విజయపురం మండలం, నెహ్రూ నగరంలో మాజీ స్టేట్ రైతు విభాగం జనరల్ సెక్రటరీ శ్రీహరిపురం ఎంపీటీసీ లక్ష్మీపతి రాజు భార్య గీత ఇటీవల మృతిచెందారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్.కే. రోజా వారి ఇంటికి చేరుకుని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మీపతి రాజును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో విజయపురం మండల YCP నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.