GDWL: బీసీ నాయకులపై గద్వాల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శిమోడల శ్రీనివాస్ సాగర్ తెలిపారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రంధాలయ ఛైర్మన్ నీలి శ్రీనివాసులను అనుచిత వ్యాఖ్యలతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దుర్భాషలాడటం తగదు అన్నారు.