సత్యసాయి: హిందూపురం పట్టణంలో ఉన్న పట్టుగూళ్ల మార్కెట్ బిల్డింగ్ శిథిలావస్థలో ఉంది. ఈ మేరకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.8కోట్లు విడుదల చేసినట్లు హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.