TPT: తిరుపతి SVU ఆర్ట్స్ కాలేజీకి చెందిన వినోద్ కుమార్కు ఫీజు బకాయిలు ఉండటంతో TC ఇవ్వలేదు. దీంతో ప్రిన్సిపల్ ఛాంబర్ ఎదుట విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన చేశాడు. ఈ మేరకు ఉన్నతాధికారులు స్పందించి, విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అందజేశారు. SVU పరిధిలోని అన్ని కాలేజీల్లో బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేయాలని ఇన్ఛార్జ్ VC అప్పారావు ఆదేశించారు.