ATP: గుంతకల్లులో కుక్కల బెడద అరికట్టాలని డిమాండ్ చేస్తూ గురువారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా భాగ్యనగర్ కాలనీవాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాలనీవాసులు మాట్లాడుతూ.. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని బయటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు.