KDP: జమ్మలమడుగు మండల పరిధిలోని గ్రామాలలో జలజీవన్ మిషన్ కింద కులాయి కనెక్షన్లు మంజూరులో అవినీతి జరిగిందని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ప్రసాద్, పట్టణ కార్యదర్శి రాంప్రసాద్ ఆరోపించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఇక్బాల్ భాషకు వినతి పత్రం ఇచ్చి, గ్రామీణ నీటి సరఫరా శాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.