NLG: అనారోగ్యంతో బాధపడుతున్న ఐటిపాముల గ్రామానికి చెందిన నాగలక్ష్మికి నకిరేకల్‌కు చెందిన ఫౌండేషన్ వారు రూ. 25,200 ఆర్థిక సహాయం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ట్రాక్టర్ ప్రమాదం కారణంగా చికిత్సకు డబ్బుల్లేక ఆమె కుటుంబం ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న యువకులు, బాధితురాలి ఇంటికి వెళ్లి సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ తదితరులు పాల్గొన్నారు.