GNTR: గుంటూరు – మంగళగిరి రైల్వే ట్రాక్ పై గురువారం ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గుంటూరు కోవిడ్ ఫైటర్ చారిటబుల్ ట్రస్ట్ వారు గుంటూరు రైల్వే పోలీస్ వారి ఆధ్వర్యంలో ఆ మృతదేహాన్ని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.