కృష్ణా: నాగార్జునసాగర్ ఎడమ కాలువ 3వ జోన్కు ఆగస్టులోనే సాగర్ జలాలు చేరాయని ప్రాజెక్ట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. బాపులపాడు మేజర్ 9వ కిమీ రెగ్యులేటర్ వద్ద జలాలను పరిశీలించిన ఆయన, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషితో ఈ నీరు చేరిందని చెప్పారు. చెరువులను నింపుకుని వృథా కాకుండా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.