JGL: ధర్మపురి పట్టణానికి చెందిన శ్రీ నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు నిన్న సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను మంత్రి సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.