VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫుంక్వాల్ సోమవారం విశాఖ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. డీఆర్ఎం లలిత్ బోహ్రాతో కలిసి ఆయన ప్రయాణికుల సౌకర్యాలు, పరిశుభ్రత, అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్యాసింజర్ రిజర్వేషన్ ఆఫీస్, జనరల్ బుకింగ్ ఆఫీస్, క్యాప్సూల్ హోటల్లను సందర్శించారు.