కోనసీమ: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం దర్శించుకున్నారు. అమ్మ వారి దర్శనానికి విచ్చేసిన మంత్రి సుభాష్‌కు ఆలయ అధికారులు, పండితులు ఘనంగా స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.