KRNL: కర్నూలు జిల్లాలో సాంకేతిక కారణాల వల్ల 2,186 కుటుంబాలు దీపం-2 పథకం లబ్ధిని పొందలేకపోయారని డీఎస్వో ఎం. రాజారఘువీర్ ఇవాళ తెలిపారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, ఎన్పీసీఐ లింకు లేకపోవడం, ఖాతాల మనుగడ సమస్యలు దీనికి ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. ప్రభావిత కుటుంబాలు తమ సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు.