NZB: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం గుండారం గ్రామంలో ఆల్ఫా జోలం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో అశోక్, రమేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 600 గ్రాముల ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఆరిఫ్ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.