KMM: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం తిరుమలాయపాలెం CHCలో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆతర్వాత రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశాక కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం ఖమ్మం కైకొండాయిగూడెం, నేలకొండపల్లి మండలంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారు.