నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ప్యారడైజ్’ మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తదుపరి మూవీలపై నయా అప్డేట్ వచ్చింది. దీని తర్వాత నాని దర్శకుడు సుజీత్‌తో మూవీ చేయనున్నారు. ఇది 2026 చివరిలో విడుదల కానుంది. అనంతరం ‘హాయ్ నాన్న’ ఫేమ్ శౌర్యువ్‌తో మరో సినిమా చేయనున్నారట. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.