యంగ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషించిన ‘మిరాయ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా రూ. వంద కోట్ల క్లబ్ చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లను వసూల్ చేసినట్లు పోస్టర్ షేర్ చేశారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించగా.. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు.