ATP: గుంతకల్లులో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. మన భావితరాల వారికి స్వచ్ఛతను ఒక అలవాటుగా చేయాల్సి వుందన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన జాతిపితను స్మరించుకోవడమే అవుతుందన్నారు.