NLR: ఎలాంటి రుణం తీసుకోకుండానే రూ.19 వేల లోన్ చెల్లించాలని ఓ యాప్ వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని జర్నలిస్ట్ ఖాన్ వాపోయారు. ఈ మేరకు నెల్లూరు చిన్న బజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదేపదే ఫోన్లు చేసి వేధిస్తున్నారని చెప్పారు. ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీకూ ఇలా జరిగిందా?