GNTR: జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తురకపాలెంలో పర్యటించారు. అక్కడ తాగునీరు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి.. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను గ్రామస్తులు కోరారు.