గుజరాత్ వాద్నగర్లో 1950లో మోదీ జన్మించారు. 8 ఏళ్ల వయసులోనే RSSలో చేరి.. 15 ఏళ్లుగా కొనసాగారు. 1987లో BJP గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో శంకర్ సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ మధ్య వివాదాలు జరగడంతో మోదీని CM పదవి వరించింది. అలా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 2014, 2019, 2024లో దేశ ప్రధానిగా హ్యాట్రిక్ నమోదు చేశారు.