TG: ప్రభుత్వం బతుకమ్మ వేడుకల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు వేడుకలను జరపనుంది. 21న వరంగల్ వేయి స్తంభాల గుడిలో వేడుకలను ప్రారంభించి.. 30న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ముగింపు వేడుకలను నిర్వహించనుంది. 28వ తేదీన LB స్టేడియంలో 10 వేలకుపైగా మహిళలతో గిన్నీస్ రికార్డ్ సాధించేలా బతుకమ్మ వేడుకలు నిర్వహణ, 50 అడుగుల ఎత్తయినా బతుకమ్మను అలంకరించనున్నారు.