MBNR: రజాకార్లపై తెలంగాణ సాయుధ పోరాట యోధులు చేసిన పోరాటానికి సాక్ష్యంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అబ్దుల్ ఖాదర్ దర్గా ఎదురుగా ఉన్నటువంటి తూర్పు కమాన్ నిలుస్తుంది. తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం ఇవ్వకుండా రజకారులు ఇబ్బందులు పెడుతున్న సందర్భంలో వారితో పాలమూరు పోరాట యోధులు విరోచిత పోరాటం చేసి కమాన్పై జాతీయ జెండాను ఆవిష్కరించారు.