KKD: చేపల వేటకు వెళ్లి మరణించిన మత్స్యకార కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ఏడేళ్లలో జిల్లాలో 18 మంది మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణించారని చెప్పారు. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా వారికి తక్షణమే పరిహారం విడుదల చేయాలని అధికారులను కోరారు.