SRD: కంగ్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్త్ నారి స్వశక్తి పరివార్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇందులో జనరల్ మెడిసిన్ డా. అరుణ శ్రీ స్థానికులకు సాధారణ వైద్య చికిత్సలు, పరీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలిక సమస్యలు, డయాబెటిస్ హైపర్టెన్షన్, కీళ్ల నొప్పులు, జ్వరం మొత్తం 37 మంది పేషెంట్లకు చికిత్సలు అందించామని మెడికల్ ఆఫీసర్ డా. నాగమణి తెలిపారు.