ELR: జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మోదీ దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి దిశగా మోదీ కృషి విశేషమని పేర్కొన్నారు.