విజయనగరం: ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి కీలకమైన సిరిమాను చెట్టు గుర్తింపు పూర్తయ్యిందనీ ఆలయ-5 సహాయ కమిషనర్ శిరీష బుధవారం తెలిపారు. ఈ ఏడాది సిరిమాను చెట్టును గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామం అప్పలనాయుడు రామకృష్ణ కల్లంలో గుర్తించినట్లు ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు తెలిపారు.