HNK: ముల్కనూర్‌లో యూరియా పంపిణీ పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగింది. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు పోలీసులు ఈ పంపిణీని దగ్గరుండి పర్యవేక్షించారు. రైతులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లలో నిలబెట్టి యూరియా అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.