CTR: పూతలపట్టు MLA మురళీమోహన్ చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్లో గల అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని బుధవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తిపూర్వకంగా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. నెయ్యి అభిషేకం, మహా హారతి సేవలలో పాల్గొని తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి వారి భజనలో పాల్గొన్నారు.