WGL: ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కళ నెరవేరుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా ఇందిరమ్మ ఇళ్లు నిలుస్తున్నాయని, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 మంజూరు చేశామన్నారు. ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, పూర్తి అవగాహనతో ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని వివరించారు.