NZB: సిరికొండ మండల కేంద్రంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం నుంచి కనబడడం లేదని భార్య లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన సుమన్, భార్యను డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వనందున ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు సుమన్ భార్య పోలీసులకు తెలిపింది.