ATP: గుత్తి RSలో బుధవారం రాత్రి రైల్వే ఉద్యోగి ఆదినారాయణకు చెందిన బైకును దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుడు తన బైక్ను రైల్వే టిక్కెట్ల బుకింగ్ కార్యాలయం వద్ద నిలిపి డీజిల్ షెడ్డులో విధులకు వెళ్లగా చోరీ జరిగింది. గురువారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.