NZB: ధర్పల్లి మండలంలోని వాడి గ్రామం ఇటీవల వరదల కారణంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. గ్రామానికి చెందిన గల్ఫ్ పనిచేస్తున్న యువకులు తమ వంతు బాధ్యతగా ముందుకు వచ్చి బస్ స్టాండ్ మరమ్మత్తుల కోసం ఆర్థిక సహాయం అందించారు. గల్ఫ్ యువకుల తరఫున రూ. 30 వేలు మొత్తాన్ని గురువారం విడిసి ఛైర్మన్ జిన్నా సాయిలుకు అందజేశారు.