NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న నాలుగు మొబైల్ ఫోన్లను సీఐ సత్యనారాయణ బుధవారం సాయంత్రం బాధితులకు అందజేశారు. బాధితులు తమ ఫోన్లను పోగొట్టుకోగా, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా వాటి ఆచూకీని కనిపెట్టామని ఆయన తెలిపారు. పోగొట్టుకున్న తమ ఫోన్లను తిరిగి ఇచ్చినందుకు బాధితులు సీఐ సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.