SKLM: సంతబొమ్మాళిలోని గొలుగువానిపేటలో బుధవారం రాత్రి నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. దీంతో రాత్రి 11 గంటల వరకు అంధకారంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గతంలో ఇక్కడ సమస్య ఉండడంతో మంత్రి అచ్చెన్నాయుడుకి తెలియజేశారు. వెంటనే స్పందించి విద్యుత్ అధికారులకు ఆదేశించారని టీడీపీ నాయకులు తెలిపారు.