MNCL: మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు కట్ట ప్రాంతాన్ని బీజేపీ నాయకులు శుభ్రం చేశారు. ప్రధాని మోడీ పుట్టినరోజు నేపథ్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చెరువు కట్ట ప్రాంతంలో మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించారు. బతుకమ్మ సందర్భంగా మహిళలకు ఇబ్బంది కలపకుండా కట్టను శుభ్రం చేశారు.