HYD: సర్దార్ వల్లభాయ్ పటేల్ దూరదృష్టితోనే ప్రస్తుతం మనందరం స్వేచ్ఛగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విమోచన దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నిజాం నిరంకుశత్వ పాలన కొనసాగుతున్న సమయంలో, సర్దార్ పటేల్ దూరదృష్టి, ధైర్యమే తెలంగాణను భారతమాత కౌగిలిలో కలిపిందని చెప్పుకొచ్చారు.